భర్త ఇంటి ముందు భార్య ధర్నా
ప్రకాశం: పొదిలిలో ఒక మహిళ తన భర్త, మామపై ఆరోపణలు చేసింది. పెళ్లై 12 ఏళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, తన భర్త నాగరాజు మరొక యువతితో సంబంధం పెట్టుకుని తనని వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లి తిరిగి రాగా, మామ తనతో అసభ్యంగా ప్రవర్తించి ఇంట్లోకి రానివ్వలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తనకు న్యాయం జరగాలని భర్త ఇంటి ధర్నా చేసింది.