రోడ్డు వేయాలని ఎన్నికల బహిష్కరణ

రోడ్డు వేయాలని ఎన్నికల బహిష్కరణ

NGKL: వెల్దండ మండలం చెదురపల్లి గ్రామపంచాయతీ బుగ్గ కాలువ తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. రోడ్డు సౌకర్యం కల్పించే వరకు ఎన్నికలను బహిష్కరిస్తామని శుక్రవారం యువకులు బ్యానర్ ప్రదర్శించారు. రోడ్డు సౌకర్యం కల్పించే వరకు ఎన్నికలలో పాల్గొనమని కలెక్టర్, ఎంపీడీవో, కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు.