'వైడబ్ల్యూసీఎస్‌ని ఆప్కోలో విలీనం చేయవద్దు'
KRNL: ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక ఖండించారు. నిన్న ఆమె మాట్లాడుతూ.. పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన ఈ సొసైటీకి దేశవ్యాప్త గుర్తింపు ఉందని, సొసైటీ అస్తిత్వం ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. విలీన ప్రతిపాదన ఉపసంహరించుకోకపోతే పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.