సిద్దవటంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

సిద్దవటంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

KDP: సిద్దవటం మండలంలోని లింగంపల్లి, కడపాయపల్లి గ్రామంలో ఆదివారం సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల స్వామి ఆలయంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని సీతారాముల మూలవిరాట్టు విగ్రహాలకు వేద పండితులు కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని, తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.