చిట్టేడులో పల్లె నిద్ర చేసిన సీఐ

TPT: కోట మండలం చిట్టేడులో వాకాడు సీఐ హుస్సేన్ భాషా సోమవారం రాత్రి 'పల్లె నిద్ర' చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజలతో మాట్లాడారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీఐ సూచించారు.