రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ELR: తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు మోటార్ సైకిల్‌పై వెళుతున్న ప్రవీణ్ ఉంగుటూరు సమీపంలో ఇవాళ మోటార్ సైకిల్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్‌కు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అతనిని హైవే అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అతనిది కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిసింది.