నేటి నుంచి స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ

నేటి నుంచి స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ

KDP: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నేటి నుంచి నిరుద్యోగులకు కడప నగరం శివారులోని ఆ బ్యాంకు వద్ద ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరిఫ్ తెలిపారు. సెల్‌ఫోన్ మరమ్మతులు, సేవలు (30 రోజులు), ఫొటో, వీడియోగ్రఫీ(31 రోజులు)పై శిక్షణ ఉంటుందన్నారు. 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న వారంతా అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.