హసీనా అప్పగింతపై ఇంటర్‌పోల్‌కు బంగ్లాదేశ్
మాజీ ప్రధాని హసీనా అప్పగింతపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్‌లపై రెడ్ నోటీసులు జారీ చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్‌ను కోరింది. ఈ మేరకు అరెస్ట్ వారెంట్‌తో దరఖాస్తు చేసుకున్నట్లు బంగ్లా దినపత్రిక ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.