రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
MBNR: బాలానగర్ మండలం పెద్దాయపల్లి వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వే బ్రిడ్జ్ సమీపంలో వేగంగా వచ్చిన కారు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో గుంతలో పడిపోగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.