VIDEO:జూరాల ప్రాజెక్టు నుంచి నీరు లీక్

VIDEO:జూరాల ప్రాజెక్టు నుంచి నీరు లీక్

NRPT: మక్తల్ పరిధిలోని జూరాల ప్రాజెక్టులోని క్రస్ట్ గేట్ల నుంచి నీరు భారీగా లీకవుతోంది. గేట్లకు మరమ్మతులు చేయకపోవడం వల్ల తుప్పు పట్టి రబ్బర్లు ఊడిపోయాయని స్థానికులు గురువారం తెలిపారు. దీని వలన వచ్చే వేసవిలో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, గేట్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.