VIDEO: సిమ్ కార్డులతో నేరాలు చేస్తున్న జిల్లా వాసి అరెస్ట్
ప్రకాశం: ఇతరుల ఫోన్లు, సిమ్ కార్డులు మార్చి ఓటీపీల ద్వారా మోసాలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్యను చీమకుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. గతనెల 29న అందిన ఫిర్యాదుపై ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు శేషయ్య ఓటీపీల ద్వారా వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్లకు వాడినట్లు గుర్తించారు. అతని వద్ద రూ. 2,60,000 వేల నగదును రికవరీ చేశామన్నారు.