ఎమ్మిగనూరులో పర్యటించిన కమిషనర్ గంగిరెడ్డి.

KRNL: మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి బుధవారం ఎమ్మిగనూరులోని 33వ వార్డులో పర్యటించారు. వార్డులో ఇంటింటికీ వెళ్లి పారిశుద్ధ్య సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్త వేరుచేసి చెత్త సేకరణకు వచ్చినప్పుడు సహకరించాలన్నారు. ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధి ప్రతీ ఒక్కరి బాధ్యత తెలిపారు.