VIDEO: అధ్వానంగా గుడివాడ-ఉంగుటూరు ప్రధాన రహదారి
కృష్ణా: ఉంగుటూరు మండలం కొయ్యగురపాడు సమీపంలో గుడివాడ-ఉంగుటూరు ప్రధాన రహదారి దుస్థితి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కొయ్యగురపాడు వద్ద భారీ టిప్పర్లు లోడ్‌తో నిరంతరం వెళ్లడంతో తారు లేచి పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రాత్రివేళ వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.