ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్
HYD: ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. నాజర్, రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ ఫ్లైట్‌లోని ఎయిర్‌హోస్టర్స్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫ్లైట్ దిగిన వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.