తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

ADB: చెన్నూరు మండల కేంద్రంలో పలువురు మహిళలు సోమవారం తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గత 20 రోజులుగా మంచి నీరు సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి గురించి మాట్లాడితే ఎన్నికల కోడ్ పేరుతో కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నీటి సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కనీసం త్రాగునీటి అవసరాలు తీర్చలేనప్పుడు ప్రభుత్వం ఉండి ఎందుకు అని విమర్శించారు.