అమూల్య ఆత్మహత్యకు కారణం ఇదే.!
ATP: నగరంలో సంచలనం సృష్టించిన అమూల్య ఆత్మహత్యకు వరకట్న వేధింపులే కారణమని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ తహశీల్దార్‌గా ఉన్న భర్త రవికుమార్ రూ. 50 లక్షల కట్నం ఇచ్చినా... అదనపు కట్నం కోసం వేధించేవారని, వరకట్న వేధింపులు భరించలేకనే అమూల్య తన కొడుకును చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెప్పారు. రవికుమార్‌ను కఠినంగా శిక్షించాలన్నారు.