అండర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి: సీపీఎం

అండర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి: సీపీఎం

NLR: చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున, అక్కడ అండర్‌పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. హైవే అథారిటీ అధికారులను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద ప్రయాణించేటప్పుడు చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.