VIDEO: పెద్దమందడి పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్

WNP: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సురక్షితమైన ప్రసవాలు జరుగుతాయనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం పెద్దమందడి పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేశారు. గర్భిణుల EDD, ప్రసవాల నమోదు రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్య అధికారులకు ఆయన సూచించారు.