ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలను గ్రామ సర్పంచ్ పూదరి రాజు శాలువాలతో సన్మానించారు. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళలు ప్రతి రంగంలో ముందుకు రావాలని, వారి సేవల గుర్తించాలన్నారు.