నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి: ఎమ్మెల్యే
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో నీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే సాగునీరు విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు వనపర్తి వరకు మాత్రమే చేరుతుందని, బుద్దారం వద్ద ఎక్కువగా నీరు వృథా అవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తుండగా, మరో రెండు మరమ్మతుల్లో ఉన్నాయని తెలిపారు.