బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికలకు ఒక రోజు ముందు ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాజేష్ గుప్తా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీని వీడుతున్న ప్రముఖ నేతల జాబితాలో తను పేరు కూడా ఉండటం బాధగా ఉందంటూ కన్నీటిపర్యంతమయ్యారు.