భూకంపం.. ఒకే కుటుంబంలో 8 మంది దుర్మరణం

భూకంపం.. ఒకే కుటుంబంలో 8 మంది దుర్మరణం

ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. ఈ భూప్రకంపనల ధాటికి ఓ ఇల్లు కూలిపోవడంతో, ఒకే కుటుంబానికి చెందిన 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భూకంప కేంద్రం హిందూకుష్ పర్వత శ్రేణుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీయగా, సహాయంక చర్యలు కొనసాగుతున్నాయి.