'సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి'

'సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి'

NRPT: వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 20న చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాగర్ పిలుపునిచ్చారు. గురువారం నారాయణపేట సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన కార్మిక సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ కూలీల పని దినాలను 200 పెంచాలన్నారు. సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని చెప్పారు.