ముమ్మరంగా వాహన తనిఖీలు
PPM: కురుపాం మండల కేంద్రంలోని ఎర్ర చెరువు ప్రధాన రహదారి వద్ద ఎస్సై పి.నారాయణరావు వాహన తనిఖీలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలు లేని వాహనదారులకు అపరాధ రుసుము వేసి, పెనాల్టీ కట్టించారు. రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.