మహోర్ చేరుకున్న జిల్లా బంజారాలు

మహోర్ చేరుకున్న జిల్లా బంజారాలు

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సేవాలాల్ మాలధారులు, భక్తులు శుక్రవారం పాదయాత్రగా మహోర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా శ్రీరామ నవమి సందర్భంగా బంజారా ప్రజల పవిత్ర స్థలమైన పోవ్రాదేవి చేరుకొని పాదయాత్రను ముగిస్తారు. అలాగే పోవ్రాదేవిలో నిర్వహించే ప్రత్యేక పూజలో పాల్గొనడానికి తండాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వెళ్తారు.