ఘట్‌కేసర్‌కు చేరుకున్న అందెశ్రీ అంతిమ యాత్ర
TG: కవి అందెశ్రీ అంతిమ యాత్ర ఘట్‌కేసర్‌కు చేరుకుంది. లాలాపేట్ నివాసం నుంచి యాత్ర కొనసాగింది. యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్‌తోపాటు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు హాజరయ్యారు. అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.