కల్వర్టుకు రంధ్రం.. రాకపోకలకు ఇబ్బందులు

కల్వర్టుకు రంధ్రం.. రాకపోకలకు ఇబ్బందులు

SRD: సిర్గాపూర్ మండలం గోరేగామ్ నుంచి నాగంపల్లి వెళ్లే రోడ్డు మధ్యలో కల్వర్టుకు పెద్ద రంధ్రం పడింది. దీంతో ప్రమాదం తలపిస్తోందని స్థానికులు శనివారం తెలిపారు. ఎదురెదురుగా వాహనాలు తారసపడితే ఈ కల్వర్టు దగ్గర ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు వాహనదారులు అంటున్నారు. అధికారులు స్పందించి ఈ రంధ్రాన్ని పూడ్చి, ప్రమాదం లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.