పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

HNK: శాయంపేట మండలం మైలారంలో యువకుడు కుక్కల అజయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పని పాట లేకుండా తిరుగుతున్నావని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అజయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.