పోటీలో నిలిచిన అభ్యర్థులకు సమావేశం
NLG: చిట్యాల మండలంలోని గ్రామ పంచాయితీలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు శనివారం మధ్యాహ్నం గం. 3:00 లకు మండల పరిషత్తు కార్యాలయంలో ఎన్నికల వ్యయ అధికారి ఆధ్వర్యంలో సమావేశం ఉంటుందని ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. ఈ సమావేశానికి పోటీలో నిలిచిన అభ్యర్థులందరూ విధిగా హాజరు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.