లోక కళ్యాణకారి.. శ్రీ సీతారాముల కళ్యాణం..!
NGKL: హిందూ సంప్రదాయంలో శ్రీరామ నవమి వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది. సీతారాముల దివ్య కలయిక ధర్మం, నీతి, కుటుంబ విలువలకు ప్రతీక. ఈ కళ్యాణంతో లోకశాంతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. సామూహిక కళ్యాణాల ద్వారా ప్రజల్లో భక్తి, ఐక్యత పెరుగుతాయి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు ఈ వేడుకను దర్శించుకోవడం శుభకరంగా భావిస్తారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సామరస్యతకు ఈ కళ్యాణం ఒక గొప్ప వేదిక.