ప్రాథమిక పాఠశాలకు మూడు అదనపు గదులు
BHNG: భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు మూడు తరగతి గదులను నిర్మించి ప్రారంభించారు. గ్రామానికి చెందిన గూడూరు సహజానంద రెడ్డి అతని తల్లిదండ్రుల(జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ) జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్, ఉప సర్పంచ్ జాన సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.