కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు పేలి కుక్క మృతి
BDK: బాంబుని కొరికి కుక్క మృతి చెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల మీద నాటు బాంబుని ఓ కుక్క తినే పదార్థం అనుకొని కొరికింది. దీంతో బాంబు పేలి కుక్క నోరు నుజు నుజ్జయి అక్కడికక్కడే చనిపోయింది. సమాచరం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.