VIDEO: ‘స్థిరమైన మార్పుతోనే పేదరిక నిర్మూలన’
కోనసీమ: నిరుపేద కుటుంబాలను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించడమే 'పీ-4' ప్రధాన లక్ష్యమని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఇవాళ అమలాపురంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. కేవలం ఆర్థిక సహాయంతో పేదరికం తొలగిపోదని, వారి జీవన విధానంలో స్థిరమైన మార్పు రావాలని స్పష్టం చేశారు. 10-20 లక్ష్యంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా పేదరికంపై సమగ్ర పోరాటం చేస్తున్నామన్నారు.