ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

PDL: ధర్మారం మండలం నంది మేడారం PACS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొంగతుర్తి, శాయంపేట, మేడారం, ధర్మారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం సందర్శించారు. కేంద్రాలలో రైతులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. బంజేరుపల్లిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆయన వెంట MRO వకీల్, MPDO ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.