చల్లపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ ర్యాలీ

చల్లపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ ర్యాలీ

కృష్ణా: చల్లపల్లిలో ఆదివారం సాయంత్రం మీలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని గ్రామంలోని చల్లపల్లి నారాయణరావు నగర్ గౌసియా మస్జీద్ వద్ధ నుంచి పుర వీధుల్లో ఇస్లాం పతాకాలతో ముస్లిం యువకులు ర్యాలీ చేశారు. గ్రామంలోని పెద్ద మస్జీద్ వరకూ నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.