VIDEO: నాలాలో పడిన వ్యక్తి.. కాపాడిన కార్పొరేటర్

VIDEO: నాలాలో పడిన వ్యక్తి.. కాపాడిన కార్పొరేటర్

HYD: పాతబస్తీలోని యాకుత్‌పురా నాలా వద్ద గొర్రెల కోసం ఆకులు కోయడానికి వెళ్లిన గౌస్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. ఆ సమయంలో నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనిని గమనించిన స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే వెంటనే స్పందించి నిచ్చెన, తాడు సాయంతో అతడిని సురక్షితంగా బయటకు తీశారు. కార్పొరేటర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.