ఘనంగా హిందూ సమ్మేళనం
NGKL: కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవనంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం హిందూ సమ్మేళనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ భారీగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.