ప్రజల భద్రత కోసమే తనిఖీలు: ఎస్పీ

ప్రజల భద్రత కోసమే తనిఖీలు: ఎస్పీ

VKB: ప్రజల భద్రత కోసమే ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. నిన్న వికారాబాద్‌లోని బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ప్రధాన చౌరస్తాలలో డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా అనుమానితులు ఉంటే 100కు డయల్ చేయాలన్నారు.