నేటి నుంచి స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి జాతర

నేటి నుంచి స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి జాతర

NLG: మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో ఈనెల 25 నుంచి జరిగే శ్రీ స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ జరిగే జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 29న రాత్రి 10 గంటలకు కళ్యాణోత్సవం, ఫిబ్రవరి 1న ఉదయం 7:30 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు.