'జనాభాగంలో దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది లాంటిది'
కృష్ణా: మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ ఆడిటోరియంలో భారతదేశ జనాభా గణన-2027 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా గణన కార్యక్రమం దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది వంటిదని, ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం సరిగ్గా, పారదర్శకంగా నమోదు చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని తెలిపారు.