ఈనెల 24న మీనాక్షి నటరాజన్ రాక

ఈనెల 24న మీనాక్షి నటరాజన్ రాక

KNR: ఈనెల 24న చొప్పదండి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర ముఖ్యనేతలు యాత్రలో పాల్గొననున్నారని తెలిపారు.