ఈనెల 26న భారీ స్థాయిలో దుర్గమ్మ ఉత్సవాలు

NTR: విజయవాడలో 11 రోజుల పాటు దుర్గమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 26న 11 దుర్గమ్మ అవతారాల ప్రదర్శనతో బెంజ్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇలాంటి వేడుక ఇప్పటివరకు ఎక్కడా జరగలేదని, ప్రపంచ రికార్డుల్లో విజయవాడ పేరు నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.