'సామరస్యంగా భూసమస్యలు పరిష్కరించుకోవాలి'

AKP: సామరస్యంగా భూసమస్యలు పరిష్కరించుకోవాలని నాతవరం తహసీల్దార్ ఏ. వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం నాతవరం ఎంపీడీవో కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదుదారులతో సమావేశమయ్యారు. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనలకు అనుసరించి ఇరువర్గాల వారికి న్యాయం చేస్తామన్నారు.