VIDEO: భైరవకోన క్షేత్రంలో భక్తుల సందడి

VIDEO: భైరవకోన క్షేత్రంలో భక్తుల సందడి

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన క్షేత్రంలో కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా జలపాతంలో భక్తులు స్నానమాచరిస్తూ, సందడి చేశారు. అనంతరం ప్రముఖ దుర్గంబా దేవిని, శ్రీ భైరవేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీకదీపం వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.