'గ్రామ పంచాయతీ కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి'

'గ్రామ పంచాయతీ కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి'

NLG: గ్రామ పంచాయతీ కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం అందించాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 8 గంటల పని విధానం, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడంతో పాటు పని భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.