మహిళ మెడలో పుస్తెలతాడు చోరీకి యత్నం
VKB: తాండూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న మహిళ ఉద్యోగం కోసం ఆర్టీసీ బస్టాండుకు వెళ్తుండగా ఆదర్శ్ నగర్ మైసమ్మ గుడి దగ్గర ఆ మహిళ మెడలో నుంచి ముగ్గురు దొంగలు పుస్తెలతాడును లాగే ప్రయత్నం చేశారు. ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఒంటరి మహిళలనే దొంగలు టార్గెట్ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.