ఉగాదికి మహానందిలో నిరంతర దర్శనం
NDL: ఉగాది పర్వదినం సందర్భంగా మహానంది ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రేపటి నుంచి నిరంతర దర్శనం కల్పించనున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి నిర్ణయించినట్లు ఏఈవో మధు గురువారం తెలిపారు. ఉదయం 5 గంటలకు అష్టవిధ మహా మంగళహారతుల అనంతరం సేవా దర్శనాలు ప్రారంభమవుతాయి. టికెట్ల కోసం రెండు కౌంటర్లు, ప్రసాదాల కోసం రెండు కౌంటర్లు నిరంతరం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.