VIDEO: సూళ్లూరుపేటలో గుండెపోటుతో డ్రైవర్ మృతి

VIDEO: సూళ్లూరుపేటలో గుండెపోటుతో డ్రైవర్ మృతి

TPT: సూళ్లూరుపేటలో సోమవారం విషాద ఘటన జరిగింది. చెన్నై నుంచి నెల్లూరుకు భారతి బస్సు సోమవారం ఉదయం బయల్దేరింది. సూళ్లూరుపేటలోకి రాగానే డ్రైవర్ శ్రావణ్ (45) అకస్మాత్తుగా స్టీరింగ్‌పై కుప్పకూలిపోయాడు. వెంటనే కండక్టర్, ప్రయాణికులు సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.