VIDEO: టీచర్ బదిలీతో కన్నీటి పర్యంతమైన విద్యార్థులు

SKLM: పాఠశాల నుంచి బదిలీపై టీచర్ వెళ్లిపోవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతమైన ఘటన బుధవారం మందసలో చోటు చేసుకుంది. మండలంలోని పొండిపూడి జడ్పీహెచ్ పాఠశాలలో సుదీర్ఘకాలం గణిత ఉపాధ్యాయుడిగా పని చేసిన నారాయణారావుకు బుసాపద్ర ఎంపీయుపీ స్కూల్ బదిలీ అయింది. ఈ సందర్భంగా ఆయనను సత్కరించి వీడ్కోలు పలికారు. తమ అభిమాన టీచర్ బదిలీపై వెళుతుండడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.