శ్రీశైల మల్లన్న సేవలో అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా

శ్రీశైల మల్లన్న సేవలో అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా

KNL: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను రాష్ట్ర అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా సోమవారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు ఈవో పెద్దిరాజు, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామిఅమ్మవార్ల దర్శనం అనంతరం దేవస్థానం తరపున శేష వస్త్రం, లడ్డు ప్రసాదాలు, జ్ఞాపికతో సత్కరించారు. ఆయన వెంట శ్రీశైలం సీఐ జి. ప్రసాదరావు ఉన్నారు.